Search
Close this search box.

  ‘సంబరాల ఏటి గట్టు’లో బాలీవుడ్ స్టార్ ఎంట్రీ..!

June 10, 2026 8:25 AM | Aditya369 News

‘సంబరాల ఏటి గట్టు’లో బాలీవుడ్ స్టార్ ఎంట్రీ..!

మెగా హీరో సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'సంబరాల ఏటి గట్టు'పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా మరో కీలక షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ముంబైలో జరిగిన తాజా షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ షెడ్యూల్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. కానీ ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం చిత్రబృందం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది. ఈ సర్‌ప్రైజ్ ఎంట్రీ సినిమాపై దేశవ్యాప్తంగా మరింత బజ్ తీసుకొస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

'హనుమాన్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ గ్రాండ్ యాక్షన్ డ్రామాలో సాయి దుర్గా తేజ్ ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకోగా, ఇందులో 'బాలి' అనే పవర్‌ఫుల్ పాత్రలో సాయి దుర్గా తేజ్ తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్ మార్చుకుని ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీటర్ హెయిన్ కంపోజ్ చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, అజనీష్ లోక్‌నాథ్ అందిస్తున్న సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్ కోసం సాయి దుర్గా తేజ్ దాదాపు రెండేళ్లుగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే చిత్ర విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న 'సంబరాల ఏటి గట్టు' సాయి దుర్గా తేజ్‌కు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మెగా హీరో సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా మరో కీలక షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ముంబైలో జరిగిన తాజా షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ షెడ్యూల్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. కానీ ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం చిత్రబృందం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది. ఈ సర్‌ప్రైజ్ ఎంట్రీ సినిమాపై దేశవ్యాప్తంగా మరింత బజ్ తీసుకొస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ గ్రాండ్ యాక్షన్ డ్రామాలో సాయి దుర్గా తేజ్ ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకోగా, ఇందులో ‘బాలి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో సాయి దుర్గా తేజ్ తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్ మార్చుకుని ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీటర్ హెయిన్ కంపోజ్ చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, అజనీష్ లోక్‌నాథ్ అందిస్తున్న సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్ కోసం సాయి దుర్గా తేజ్ దాదాపు రెండేళ్లుగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే చిత్ర విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘సంబరాల ఏటి గట్టు’ సాయి దుర్గా తేజ్‌కు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore