వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కరప మండలంలోని అన్ని గ్రామాలలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏవో ఐ సత్య తెలిపారు.గ్రామాల్లో శుక్రవారం రైతుసేవా కేంద్రం వద్ద బ్రోమోడయోలిన్ అనే ఎలుకల మందును నూకలలో కలిపి ఉచితంగా రైతులకు పంపిణీ చేస్తామన్నారు.అందరూ రైతులు తప్పక హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వ్యవసాయ అధికారులు కోరారు.









