కుంభమేళాలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. కోట్లమంది భక్తులు ప్రయాగ రాజ్ కు పోటెత్తుతుండడంతో వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.కొంతమంది రెండురోజులుగా ట్రాఫిక్ లోనే ఉన్నట్లు వాపోతున్నారు.త్వరగా ట్రాఫిక్ అంతరాయలు తొలగేలా ఉత్తరప్రదేశ్ సర్కార్ చర్యలు చేపట్టాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ డిమాండ్ చేశారు.









