Search
Close this search box.

  రామ్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్..! హిట్ కోసం తప్పని తిప్పలు..?

April 20, 2026 11:30 PM | Aditya369 News

రామ్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్..! హిట్ కోసం తప్పని తిప్పలు..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతనేని ఎనర్జీ, డ్యాన్స్, వేరైటీ యాక్టింగ్‌తో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఇటీవల వచ్చిన ఆయన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై రామ్ మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడు.

ఇక ఆయన తదుపరి సినిమా విషయంలో కొంతకాలంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగారాజి శిష్యుడు విగ్నేష్ దర్శకత్వంలో రామ్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ దాదాపు ఫైనల్ అయ్యిందనే టాక్ కూడా వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం, ఆ దర్శకుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కాంబో కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు.

అయితే రామ్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈసారి కథను స్వయంగా రామ్ సిద్ధం చేసుకున్నాడనే వార్త ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు, ఈ సినిమాకు ‘The Lone Wolf’ అనే డిఫరెంట్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్.

మొత్తానికి, ఈ ప్రాజెక్ట్‌తో అయినా రామ్ పోతినేని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. మరి ఈ సినిమా ఆయన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకువస్తుందా అనేది చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు