Search
Close this search box.

  మైసా కోసం రష్మిక రిస్క్..?

April 29, 2026 11:16 PM | Aditya369 News

మైసా కోసం రష్మిక రిస్క్..?

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించిన స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న. కేవలం “నేషనల్ క్రష్”గానే కాదు, బాక్సాఫీస్ వద్ద వరుస హిట్లతో “క్వీన్”గా కూడా పేరు తెచ్చుకుంది. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్—ఏ పాత్ర అయినా పరకాయ ప్రవేశంలా జీవించే ఆమె, అల్లరి అమ్మాయి నుంచి రాణి వరకు ఎన్నో విభిన్న పాత్రల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పుష్ప, పుష్ప 2, అనిమల్, సికిందర్, చావా, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలతో గత మూడు సంవత్సరాల్లోనే భారీ కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది.

మైసా కోసం రష్మిక రిస్క్

వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక, వ్యక్తిగత జీవితంలో విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కేవలం కొద్ది రోజుల బ్రేక్ తీసుకుని మళ్లీ షూటింగ్స్‌లో బిజీ అయింది. ప్రస్తుతం ఆమె మైసా మరియు రణబలి చిత్రాల్లో నటిస్తోంది. ముఖ్యంగా మైసా సినిమా కోసం ఆమె చేస్తున్న సాహసాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

డూప్ లేకుండా డేంజరస్ స్టంట్

డైరెక్టర్ రవీంద్ర తెరకెక్కిస్తున్న మైసా యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఇందులో రష్మిక గోండు గిరిజన యువతిగా కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఆమె చేసిన స్టంట్స్ నిజంగానే షాకింగ్. కేరళలోని అత్తిరపాలి ఫాల్స్ వద్ద చిత్రీకరించిన ఓ యాక్షన్ సీన్‌లో, రష్మిక ఎలాంటి డూప్ లేకుండా సుమారు 80 అడుగుల ఎత్తు నుంచి దూకింది. ఆ సమయంలో గాయాలు అయినా కూడా బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ కొనసాగించిందని దర్శకుడు తెలిపారు.

8 గంటల కఠిన శిక్షణ

ఈ సినిమాలో యాక్షన్ రియలిస్టిక్‌గా ఉండేందుకు, అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ కేచ  పర్యవేక్షణలో రష్మిక ట్రైనింగ్ తీసుకుంది. బ్యాంకాక్‌లో వారం రోజుల పాటు రోజుకు 8 గంటల పాటు మార్షల్ ఆర్ట్స్, గిరిజన యుద్ధ పద్ధతులు నేర్చుకుని, ఈ సినిమా కోసం ప్రత్యేక యాక్షన్ స్టైల్‌ను అలవాటు చేసుకుంది.

మొత్తానికి, మైసా కోసం రష్మిక పడుతున్న కష్టం, చూపిస్తున్న డెడికేషన్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందా లేదా అనేది ఇప్పుడు అందరి ఆసక్తి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore