ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టింది. ముందుగా చెప్పినట్టుగానే మున్సిపాల్టీలు, నగరపంచాయతీలు, కార్పోరేషన్ల పరిధిలో ఉన్న స్థానాలను పెంచింది. ఈమేరకు రెండు జీవోలు MS. నెంబర్లు 64,65 లను విడుదల చేసింది. జనాభా ప్రాతిపదికన వార్డులు / డివిజన్లను పెంచింది. దీని వల్ల ఈసారి పోటీ దారులకు ఊరట లభించనుంది. వార్డులు, డివిజన్ల స్థానాల పెంపుతో పోటీ చేసే ఆశావాహులకు మార్గం సుగమమయ్యే అవకాశాలున్నాయి.రానున్న లోకల్ బాడీల ఎన్నికలలోపు వీటిని అమలు చేయనున్నారు. ఈమేరకు కసరత్తు చేసి, వార్డులు, డివిజన్లు ఏవిధంగా సిద్ధం చేయాలనే దానిపై అన్ని మున్సిపాల్టీల, నగర పంచాయతీల, కార్పోరేషన్ల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈప్రక్రియ పూర్తికాగానే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.
మంత్రి మాట..తర్వాత రోజే జీవోలు
ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ సోమవారం(23న) నాడు కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా పిఠాపురంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కార్పోరేషన్లు, నగరపంచాయతీలు, మున్సిపాల్టీలలో వార్డులు/ డివిజన్లు పెంచే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. కసరత్తు జరుగుతుందని, త్వరలో విధి విధానాలు రూపొందించడం జరుగుతుందన్నారు. ఆయన చెప్పిన ఒక్కరోజు గడవకముందే ప్రభుత్వం జీవోలను విడుదల చేసింది.
స్థానాలు ఏవిధంగా పెరుగుతున్నాయో ఈ కింద పట్టికలను గమనించవచ్చు.
మున్సిపాల్టీలు, నగరపంచాయతీలలో జనాభా ప్రాతిపదికన వార్డులు

కార్పోరేషన్ల పరిధిలో జనాభా ప్రాతిపదికన డివిజన్ల పెంపు ఇలా…..









