Search
Close this search box.

  బాల్య వివాహ రహిత జిల్లాగా కాకినాడను తీర్చి దిద్దాలి

February 5, 2026 3:54 PM | Aditya369 News

బాల్య వివాహ రహిత జిల్లాగా కాకినాడను తీర్చి దిద్దాలి

జిల్లా మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి ఆదేశాలతో జిల్లా మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ,చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్ స్వచ్చంద సంస్థ సంయుక్తంగా బాల్య వివాహ విముక్తి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ దుర్గాదేవి మాట్లాడుతూ బాల్య వివాహం చట్ట విరుద్ధమని,చట్టం ప్రకారం అమ్మాయికి 18 సం అబ్బాయికి 21సం పూర్తి కాకుండా వివాహం చేయరాదన్నారు.ఎవరైనా బాల్యవివాహాలు చేస్తే రెండు సంవత్సరాలు జైలు శిక్ష,లక్ష రూపాయలు జరిమానా విధిస్తారన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి మాట్లాడుతూ బాలికలకు విద్య ఎంతో కీలకమని,చదువు పూర్తి చేయడం ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు.బాల్య వివాహాలపై సమాచారం అందిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా పోలీస్ 112కి ఫోన్ చేసి తెలియజేయాలని, ఫిర్యాదులు ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.ఈ కార్యక్రమంలో క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ సిఎస్డబ్ల్యు పి చంద్రిక, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ ,కెఎస్.అరుణశ్రీ,కె సత్యనారాయణమ్మ ,అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు