ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారా? ఈ ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీతో సినిమా అనే వార్త మరింత సంచలనం రేపుతోంది.
ఇప్పటికే అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ కారా అనౌన్స్ అయ్యి మంచి బజ్ సొంతం చేసుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఈ సినిమా రేంజ్ ఏంటో చూపించిన మేకర్స్, ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు.
ఇక ఇదే సమయంలో బన్నీ తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ప్రముఖ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ కథతో, సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక హిందీ సినిమా చేయనున్నాడనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే ముంబైలో పలుమార్లు సమావేశమయ్యారన్న వార్తలు కూడా ఈ కాంబినేషన్‌పై ఊహాగానాలను మరింత పెంచుతున్నాయి.
అయితే, అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో ‘కారా’ సినిమాతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో కూడా ఓ సినిమా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.
ఇలా సౌత్ నుంచి నార్త్ వరకు మార్కెట్‌ను విస్తరించడానికి బన్నీ స్ట్రాంగ్ ప్లానింగ్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రతి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ తన రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మొత్తానికి, అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీపై వస్తున్న ఈ వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.








