Search
Close this search box.

  ప్రశాంత్ నీల్ దాచిపెట్టిన సీక్రెట్.. ‘డ్రాగన్’ లుక్‌పై క్రేజీ బజ్..!

June 6, 2026 11:07 AM | Aditya369 News

ప్రశాంత్ నీల్ దాచిపెట్టిన సీక్రెట్.. ‘డ్రాగన్’ లుక్‌పై క్రేజీ బజ్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ విజువల్స్, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

గ్లింప్స్‌లో ఎన్టీఆర్ లుగర్ లుక్‌ను చూపించిన మేకర్స్, ఆయన అసలు ‘డ్రాగన్’ అవతార్‌ను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. దీంతో అభిమానుల్లో ఆ లుక్‌పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ డ్రాగన్ లుక్ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా కొత్త మేకోవర్‌తో కనిపించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. అయితే అసలు డ్రాగన్ అవతార్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన ఈ ప్రత్యేక లుక్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి డిసెంబర్‌లో రానున్న డ్రాగన్ లుక్ అభిమానులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore