Search
Close this search box.

  ప్రభాస్ స్పిరిట్ ఈగో వర్సెస్ ఈగో..?

May 20, 2026 7:50 AM | Aditya369 News

ప్రభాస్ స్పిరిట్ ఈగో వర్సెస్ ఈగో..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయి కాప్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో చూపించేందుకు సందీప్ రెడ్డి వంగా రెడీ అవుతున్నాడు. ముఖ్యంగా రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడనే వార్తలు అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా… ప్రస్తుతం కీలకమైన పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సీన్స్‌లో భారీ యాక్షన్ కంటే కూడా ఇంటెన్స్ సైలెన్స్ డ్రామాపైనే సందీప్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడట. డైలాగ్స్ కంటే కళ్లతోనే వార్ చేసే సన్నివేశాలను చాలా పవర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నారని సమాచారం.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ – వివేక్ ఒబెరాయ్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ సాధారణ హీరో విలన్ ఫైట్‌లా కాకుండా… మైండ్ గేమ్స్, ఈగో క్లాష్, సైలెంట్ వార్‌లా ఉండబోతుందని తెలుస్తోంది. ఒకవైపు రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్… మరోవైపు పవర్‌ఫుల్ వ్యక్తిగా వివేక్ ఒబెరాయ్… వీరిద్దరి మధ్య జరిగే డ్రామా సినిమాకు మెయిన్ హైలైట్ కానుందట.

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా… భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు