పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామంలో 11 మంది పేకాట ఆడుతుండగా పట్టుబడ్డారు. మంగళవారం రాత్రి పిఠాపురం పట్టణ పోలీసులకు అందిన సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. పిఠాపురం టౌన్ ఎస్సై వి.మణికుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.21,700 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేశారు. పండగ సీజన్ కావడంతో పిఠాపురంలో ఈ తరహా ఆటలు ఎక్కువ కావడంతో పోలీసులు ఎక్కడికక్కడ నిఘా పెంచారు.








