తన నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని జనసేనాని, డిప్యూటీసిఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.పిఠాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రిగా పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆరున్నర నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సంవత్సర ప్రారంభరోజు ‘సమగ్ర అభివృద్ధి నివేదిక-2024’ పేరిట విడుదల చేశారు.రూ.2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం రూ.72 లక్షలతో గొల్లప్రోలులో తాగునీటి సౌకర్యాల కల్పనతో పాటు తాను ఈ ఆరున్నర నెలల కాలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల వివరాలను ఏపీ డిప్యూటీ సీఎం పేషీ ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ప్రగతి, పారదర్శకత,సుస్థిరత, జవాబుదారీతనం నాలుగు స్తంభాలుగా ప్రజలు ఎన్నుకున్న మంచి ప్రభుత్వంలో తాను ఉండడం సంతోషంగా ఉందన్నారు.
పిఠాపురం అభివృద్ధికి పలు ప్రణాళికలు
నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు.రూ.32 స్కూళ్లకు క్రీడా కిట్ల పంపిణీ, సీహెచ్ సీని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్, పాఠశాలలు, కాలేజీల్లో ఆర్ఓ ప్లాంట్లు సహా మరికొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు ప్రకటించారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పా టైన తర్వాత పాఠశాలలు, కాలేజీల్లో ఆర్ఓ ప్లాంట్లు సహా మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు.









