ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడిన నేపథ్యంలో దానినుంచి ప్రమాదకరమైన గ్యాస్ లీకవుతుండటంతో అప్రమత్తమైన అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.ఈ క్రమంలో ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి వచ్చి అనేక గంటలు కృషి చేసి గురువారం తెల్లవారుజామున ట్యాంకర్ ను అక్కడినుంచి తొలగించారు.దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయని హైవే కంట్రోల్ రూమ్ అధికారులు తెలిపారు. పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు మరికొన్నిగంటల సమయంపడుతోందన్నారు.









