Search
Close this search box.

  నివేతా పేతురాజ్‌కు డబుల్ బంపర్ ఆఫర్స్..!

May 26, 2026 11:09 PM | Aditya369 News

నివేతా పేతురాజ్‌కు డబుల్ బంపర్ ఆఫర్స్..!

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ నివేతా పేతురాజ్.. కొంతకాలంగా సైలెంట్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అవ్వడానికి రెడీ అవుతోంది. వరుసగా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు దక్కించుకుని మరోసారి వార్తల్లో నిలిచింది.

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’లో నివేతా పేతురాజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె ఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా కనిపించనుందని, ఇప్పటికే షూటింగ్‌లో కూడా జాయిన్ అయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇదే సమయంలో నివేతాకు మరో భారీ ఆఫర్ కూడా వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్‌లో కూడా ఆమెకు కీలక పాత్ర దక్కిందట. ఈ సినిమాలో నివేతా జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని సమాచారం. చిరంజీవి సినిమాలో అవకాశం రావడం అంటే ఏ హీరోయిన్‌కైనా ప్రత్యేకమే.. ఇప్పుడు నివేతాకు కూడా అదే రేంజ్‌లో బిగ్ బ్రేక్ దక్కిందని సినీ వర్గాలు అంటున్నాయి.

కొన్నాళ్లుగా వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న నివేతా.. ఇప్పుడు వరుస మెగా ప్రాజెక్ట్స్‌తో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే.. టాలీవుడ్‌లో నివేతా పేతురాజ్‌కు మరోసారి మంచి క్రేజ్ రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore