కరప మండలంలో ఉప్పలంక గ్రామంలో కర్రి ఆదిలక్ష్మి కుటుంబానికి ‘చేయూత సంస్థ’ ఆపన్నహస్తం అందించింది.భర్త అప్పులు చేసి వదిలేయడంతో, ముగ్గురు ఆడపిల్లలతో జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నట్టు తెలుసుకున్న చేయూత సంస్థ ప్రతినిధులు తక్షణమే స్పందించారు. సంస్థ కాకినాడ రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు నున్న గణేష్ నాయుడు,కో-ఆర్డినేటర్ యాళ్ళ సత్యనారాయణ (పండు), మండల ఇంచార్జీ విష్ణు నాయుడు ఆదివారం నేరుగా వారి ఇంటికి వెళ్లి సంస్థ అధినేత డాక్టర్ రవి కుమార్ ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువులు,ఒక నెల ఇంటి అద్దె,పిల్లలకు కొత్త బట్టలను అందించారు. ముగ్గురు ఆడపిల్లలను తమ సంస్థ చదివిస్తుందని,ఆ తల్లికి గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించేందుకు సంస్థలోనే ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే చేయూత లక్ష్యం.ఆదిలక్ష్మి కుటుంబం ఇకపై ఒంటరి కాదు, మా సంస్థ వారికి అన్ని విధాలా అండగా ఉంటుంది” అని ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు.









