తెలంగాణా రాష్ట్రంలో ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనసేన- బీజేపీ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 7, 8 తేదిల్లో నిర్ణయించిన ప్రాంతాల్లో పవన్ ప్రచారం చేయనున్నారు. తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పవన్ దీనిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి తాను హాజరవుతున్నట్లు పవన్ గ్నీన్ సిగ్నల్ ఇచ్చారు.









