Search
Close this search box.

  ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రశాంత్ నీల్ మాస్ ప్లాన్..!

June 29, 2026 9:56 AM | Aditya369 News

‘డ్రాగన్’లో ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రశాంత్ నీల్ మాస్ ప్లాన్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'డ్రాగన్' నుంచి మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.

 

ప్రస్తుతం ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రత్యేక సెట్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఎంట్రీ సీన్‌లో ఎన్టీఆర్ ఇప్పటివరకు కనిపించని సరికొత్త గెటప్‌లో దర్శనమివ్వనున్నారట. అభిమానులకు థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఈ సీక్వెన్స్‌ను ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు టాక్.

 

అంతేకాదు... ఈ హై-వోల్టేజ్ ఎంట్రీలో ఎన్టీఆర్‌తో పాటు దాదాపు 40 మంది ఫైటర్స్ పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ పూర్తయిన వెంటనే నెక్స్ట్ షెడ్యూల్‌లో ఓ భారీ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట.

 

ఇక ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే డార్క్ టోన్, బ్లాక్ అండ్ గ్రే విజువల్స్ గుర్తుకొస్తాయి. కానీ 'డ్రాగన్' విషయంలో మాత్రం ఆయన పూర్తిగా కొత్త స్టైల్‌ను ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని, ఆయన ట్రేడ్‌మార్క్ డార్క్ షేడ్స్ కూడా పెద్దగా కనిపించవని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొనగా... ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కలిసి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డ్రాగన్’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.

 

ప్రస్తుతం ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రత్యేక సెట్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఎంట్రీ సీన్‌లో ఎన్టీఆర్ ఇప్పటివరకు కనిపించని సరికొత్త గెటప్‌లో దర్శనమివ్వనున్నారట. అభిమానులకు థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఈ సీక్వెన్స్‌ను ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు టాక్.

 

అంతేకాదు… ఈ హై-వోల్టేజ్ ఎంట్రీలో ఎన్టీఆర్‌తో పాటు దాదాపు 40 మంది ఫైటర్స్ పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ పూర్తయిన వెంటనే నెక్స్ట్ షెడ్యూల్‌లో ఓ భారీ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట.

 

ఇక ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే డార్క్ టోన్, బ్లాక్ అండ్ గ్రే విజువల్స్ గుర్తుకొస్తాయి. కానీ ‘డ్రాగన్’ విషయంలో మాత్రం ఆయన పూర్తిగా కొత్త స్టైల్‌ను ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని, ఆయన ట్రేడ్‌మార్క్ డార్క్ షేడ్స్ కూడా పెద్దగా కనిపించవని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొనగా… ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కలిసి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు