జనసేన ఆధ్వర్యంలో త్వరలో గుడ్ మార్నింగ్ పిఠాపురం పేరుతో కార్యక్రమాన్ని చేపడతామని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మలబాబు వెల్లడించారు. ప్రతీ రోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. వార్డుల బూత్ ఇన్ఛార్జిలు, కమిటీ మెంబర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఫైమెన్ కమిటీ సభ్యుల వద్దకు కూడా వెళ్ళవచ్చన్నారు. పవన్ ఆశయాల కోసమే ఫైమెన్ కమిటీ పనిచేస్తోందన్నారు. పవన్ ప్రవేశపెట్టిన మెంబర్ టూ లీడర్ అనేది పిఠాపురం నుండే మొదలుకావడం ఆనందకరమన్నారు.









