Search
Close this search box.

  జననాయగన్ రిలీజ్ ఫిక్స్..! సీఎం అయిన తర్వాత విజయ్ తొలి సినిమా..!

May 10, 2026 10:06 PM | Aditya369 News

జననాయగన్ రిలీజ్ ఫిక్స్..! సీఎం అయిన తర్వాత విజయ్ తొలి సినిమా..!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయగన్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, అనూహ్య పరిణామాల కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్‌పై కుట్ర జరుగుతోందని అప్పట్లో అభిమానులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సెన్సార్ సమస్యలు, అనుమతుల జాప్యం కారణంగా సినిమా విడుదల ఆగిపోయిందనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి.

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేయగా, ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పరిణామంతో ‘జననాయగన్’ సినిమా మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. విజయ్ ముఖ్యమంత్రి కావడంతో ఇక సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “సినిమాను ఆపాలని చూసిన వారికే ప్రజలు గట్టి సమాధానం చెప్పారు” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఇక తాజాగా చిత్ర నిర్మాతలు సినిమా విడుదలపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత మాట్లాడుతూ… “జననాయగన్ విడుదల విషయంలో ఇక ఎలాంటి ఆటంకాలు లేవు. సినిమా ఖచ్చితంగా విడుదల అవుతుంది” అని స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రస్తుతం సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ నటించిన ఈ చిత్రం మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని వెల్లడించారు. అయితే అధికారిక విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం… ఈ సినిమా మే 28న విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం కూడా వైరల్ అవుతోంది. సాధారణంగా విజయ్ సినిమాల్లో టైటిల్ కార్డ్స్‌లో “దళపతి విజయ్” అని చూపిస్తారు. కానీ ఈసారి మాత్రం “తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్” అంటూ టైటిల్ కార్డ్స్‌లో ప్రదర్శించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఒక హీరో పేరు పక్కన “చీఫ్ మినిస్టర్” హోదా రావడం భారత సినీ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇలా రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా మారిన తర్వాత విజయ్ నటించిన తొలి చిత్రం కావడంతో ‘జననాయగన్’పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతున్న ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore