పుష్పా-2 విడుదల సందర్భంగా అంటించిన వాల్ పోస్టర్లను చించి వేయడం చర్చనీయాంశమైంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో పలు చోట్ల పుష్పా-2 సినిమా పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ నెల 5న పుష్పా-2 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈతరహా ఘటనలు అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అయితే దీనిపై ఎటువంటి ఫిర్యాదులు రాలేదని పోలీసులు చెబుతున్నారు. కొంతకాలంగా మెగా -అల్లు అభిమానుల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం విధితమే









