కాకినాడ జిల్లా కరపలో ఉప్పాలమ్మ తల్లి వార్షికోత్సవ మహోత్సవం అంగ రంగ వైభవంగా గురువారం నిర్వహించారు.గ్రామ ఆడపడుచులు 108 కళాశాలతో డోలు,సన్నాయి వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.విలపర్తి సుబ్రమణ్య శాస్త్రి ఆధ్వర్యంలో శాస్త్రోక్త పూజలు, అభిషేకాలు జరిగాయి.గ్రామ పెద్దలు కానుకలు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.5000 మంది భక్తులకు భారీ అన్నదానం చేశారు.టీడీపీ మాజీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు,మాజీ జడ్పిటిసి నురుకుర్తి వెంకటేశ్వరరావు అమ్మవారిని దర్శించుకున్నారు.ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి సత్తిబాబ ,జడ్పిటిసి వై సుబ్బారావు తదితరులు హాజరయ్యారు.ఆలయ కమిటీ సభ్యులు మురళీ,వెంకన్న పాల్గొన్నారు.








