కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళల అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.భీమారపుకోట గ్రామానికి చెందిన పి దుర్గభవాని(23) బుధవారం సాయంత్రం నుంచి కనిపించట్లేదు దుర్గభవాని అన్నయ్య భాస్కర్ ఫిర్యాదు చేశారు.కోటనందురుకు చెందిన బి సునీత (22)మంగళవారం తెల్లవారుజాము నుంచి కనపడలేదని బంధువు గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు.అదృశ్యమైన మహిళల కొరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు.









