ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుటుంబస మేతంగా వెళ్ళారు.కుటుంబంతో కలిసి బోట్ రైడ్ చేశారు.అనంతరం త్రివేణి సంగమానికి చేరుకున్నారు.ఇప్పటికే రాష్ట్ర పతి ద్రౌపదిముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు పుణ్య స్నానాలు ఆచరించారు.మాఘ పూర్ణిమతో పాటు ఇంకొన్ని రోజుల్లో కుంభమేళా పూర్తి కావొస్తుండంతో భారీగా భక్తులు తరలిరానున్నారు.









