Search
Close this search box.

  కరప సొసైటీ సిబ్బంది అవకతవకలు సొమ్ము తిరిగి జమా

April 16, 2026 11:31 AM | Aditya369 News

కరప సొసైటీ సిబ్బంది అవకతవకలు సొమ్ము తిరిగి జమా

కరప ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సిబ్బంది ఎరువులు విక్రయాల్లో అవకతవకలకు పాల్పడ్డిన సొమ్ములు తిరిగి సొసైటీ అకౌంట్లో జమా చేయించడం జరిగిందని సొసైటీ అధ్యక్షుడు సైనవరపు భవానీ శంకర్ తెలిపారు.బుధవారం సొసైటీ కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ మీడియాలో వచ్చిన వార్తలపై జిల్లా అధికారులు డిసిఒ శ్రీనివాస్ రెడ్డి, జెడి విజయ్ కుమార్ లు విచారణ చేపట్టి సొసైటీలో రికార్డులు పరిశీలించారు.ఈ విచారనలో ఎరువులు అక్రమ రవాణా అన్నది పూర్తిగా అవాస్తము అని తేల్చారు. అయితే సొసైటీ నుండి ఎరువులు అమ్మిన బస్తాలకు సొమ్ములకు వ్యత్యాసం కనుగొన్నారు. 119 బస్తాలు సొమ్ములు రూ74 వేల పక్కదారి పట్టినట్టు గుర్తించారు.ఎవరైతే ఈ ఎరువులు అమ్మకాలు జరిపారో వారి ను బాధ్యులుగా గుర్తించి ఈ అవకతగలకు సంబంధించిన సొమ్ములు తిరిగి చెల్లించేందుకు48 గంటలు సమయం ఇచ్చి సొసైటీకి చెల్లించాలని అవకతవకలకు పాల్పడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదించారు.సొమ్ము రికవరీ చేసే బాధ్యతను సొసైటీ అధ్యక్షులుగా తనకి కమిటీకి అప్పగించడం జరిగిందన్నారు.దాంతో ఈ ఈనెల 13న అవకతవకలు పాల్పడిన వారి నుండి రూ 74 వేల సొసైటీ ఎకౌంట్లో జమా చేయించి ఉన్నత అధికారులకు తెలియజేశామన్నారు.కూటమి ప్రభుత్వంలో సొసైటీలో ఎరువులు అక్రమ రవాణా కాదని సిబ్బంది ఎరువుల అమ్మకాల సొమ్ము లో అవకతవకలు పాల్పడినట్టు అధికారులు నిగ్గు తేల్చడం జరిగిందన్నారు.సొసైటీని ఉన్నత స్థానంలో ఉంచాలనే సంకల్పంతో సొసైటీ కమిటీ పనిచేస్తోందని అధ్యక్షుడు భవాని శంకర్ తెలిపారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి ఐ సత్య, డైరెక్టర్లు సోడిశెట్టి సత్యనారాయణ, అడపా శ్రీను, సీఈవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు