భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ఏదైనా ఉందంటే.. అది దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొచ్చింది.
ఇప్పటికే బాహుబలి విశ్వాన్ని విస్తరిస్తూ పలు వెబ్ కంటెంట్లు, సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన ప్రత్యేక డాక్యుమెంటరీ “Baahubali: The Torch Bearer” ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా, అనుష్క కలిసి బాహుబలి ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడారు. అదే సమయంలో ప్రభాస్ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“బాహుబలి లెగసీ ఇక్కడితో ముగియలేదు… పార్ట్ 3 కూడా ఉంది” అంటూ ప్రభాస్ చెప్పడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. అయితే ఇది అధికారిక ప్రకటననా? లేక సరదాగా చేసిన వ్యాఖ్యనా? అనే దానిపై చర్చ కొనసాగుతోంది.
మరి నిజంగానే బాహుబలి 3 రాబోతోందా? దీనిపై రాజమౌళి లేదా నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.









