Search
Close this search box.

  ఏప్రిల్ 1 నుండి టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో మార్పులు

March 6, 2025 8:55 PM | Aditya369 News

ఏప్రిల్ 1 నుండి టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో మార్పులు

ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చే TDS,TCS పన్ను విధానాల్లో కేంద్రం కీలక మార్పులను ప్రకటించింది. ఈ క్రమంలో వ్యాపారులకు రూ.50 లక్షల కుపైగా అమ్మకాలపై విధించే TCS రద్దు చేయబడింది.దీంతో ఏప్రిల్ 1,2025 నుంచి వ్యాపారులు అధిక విలువ కలిగిన అమ్మకాలపై 0.1% TCS చెల్లించా ల్సిన అవసరం లేదు. దీంతోపాటు టీసీఎస్ పరిమితిని రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచారు. పిల్లల చదువు, కుటుంబ ఖర్చులు లేదా మరేదైనా ప్రయోజనం కోసం మీరు ఇప్పుడు TCS లేకుండా విదేశాలకు రూ. 10 లక్షల వరకు పంపించుకోవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత సులభతరం చేస్తుంది. దీంతోపాటు మీ డబ్బును విద్యా రుణం ద్వారా పంపిస్తే ఎలాంటి TCS ఉండదు. ఇది విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూడా ఉపశమనం కలిగించే వార్త అని చెప్పవచ్చు.

◆అధిక పన్ను రేట్ల నుంచి ఉపశమనం

అంతేకాదు ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇకపై TDS/TCS ఉండదు. గతంలో ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయని వ్యక్తులు అధిక TDS/TCS తగ్గింపులను ఎదుర్కొవాల్సి వచ్చేది. సాధారణ పన్ను చెల్లింపుదారులు, చిన్న వ్యాపారాలకు అధిక పన్ను రేట్ల నుంచి ఉపశమనం కల్పించడానికి బడ్జెట్ 2025 ఈ నిబంధనను తొలగించాలని ప్రతిపాదించా రు.వసూళ్ల పరంగా ముఖ్యంగా విదేశాలకు డబ్బు పంపడం, అధిక విలువ కలిగిన కొనుగోళ్లు చేయడం, వ్యాపార లావాదేవీలను నిర్వహించడం వంటి రంగాలలో అనేక మార్పులను ప్రకటించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు