యంగ్ టైగర్ ఎన్టీఆర్ – స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుందట. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియోలో ప్రశాంత్ నీల్ కథలోని పలు ముఖ్యమైన పాత్రలను పరిచయం చేసినప్పటికీ.. అసలు కథకు ప్రాణం అయిన మెయిన్ కాన్ఫ్లిక్ట్ను మాత్రం పూర్తిగా దాచిపెట్టాడని టాక్ వినిపిస్తోంది.
ఇక అదే మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌కు సంబంధించిన ట్రాక్‌లో కృతి సనన్ పాత్ర ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆమె పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే స్థాయిలో ఉండబోతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
అయితే ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉందట. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే డార్క్ టోన్, బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్స్ గుర్తుకు వస్తాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల్లో కూడా అదే విజువల్ స్టైల్‌ను ప్రేక్షకులు చూశారు.
కానీ, ఎన్టీఆర్ కోసం మాత్రం ప్రశాంత్ నీల్ తన స్టైల్‌ను పూర్తిగా మార్చబోతున్నాడట. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మొత్తం ఎంతో కలర్ఫుల్గా, విజువల్‌గా రిచ్‌గా ఉండబోతుందనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో ప్రశాంత్ నీల్‌కు ట్రేడ్‌మార్క్‌గా మారిన బ్లాక్ షేడ్ ఫ్రేమ్స్ కూడా కనిపించవని సమాచారం.
మరి ఈ కలర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ వెనుక ఎలాంటి ఎమోషన్ దాగి ఉంది..? ఎన్టీఆర్ పాత్రకు అది ఎలాంటి బలం చేకూరుస్తుంది..? అనే విషయాలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మరి ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో చూడాలి.









