యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్ పై రోజురోజుకీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుండగా… అందరూ ఇది మరో డార్క్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా అని భావించారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఒక షాకింగ్ అప్డేట్ సినిమాపై ఉన్న అంచనాలను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది.
తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ నీల్… “గ్లింప్స్ చూసి ఇది కేవలం డార్క్ యాక్షన్ ఫిల్మ్ అనుకుంటే పొరపాటే” అంటూ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై ఎవరూ చూడని విధంగా, ఒక భారీ దేశభక్తి కథను డార్క్ వరల్డ్‌లో చూపిస్తున్నామని తెలిపారు. చీకటి ప్రపంచంలో దేశభక్తిని మిక్స్ చేయడం అనేది ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతి ఇస్తుందని చెప్పారు.
ఈ సినిమా కథ 1947 స్వాతంత్ర్యం తర్వాత ప్రారంభమై… 1960ల కాలంలో సాగుతుందని వెల్లడించారు. బ్రిటిష్ వెళ్లిపోయిన తర్వాత ముంబై, కోల్‌కతా ప్రాంతాల్లో పెరిగిన నల్లమందు, హెరాయిన్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుందని చెప్పారు. ఈ క్రూరమైన ప్రపంచంలో ఎన్టీఆర్ “లూగర్” అనే పవర్ఫుల్ అసాసిన్ పాత్రలో కనిపించబోతున్నారని తెలిపారు. తాను ఇప్పటివరకు రాసిన పాత్రల్లో ఇదే అత్యంత డార్క్ క్యారెక్టర్ అని… అలాంటి రోల్ చేయడానికి ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా రిస్కీ అని ప్రశంసించారు.
ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ కూడా మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. లీన్ అండ్ ఫిట్ అసాసిన్లా కనిపించడానికి దాదాపు 15 నుంచి 16 కిలోల వరకు బరువు తగ్గారని ప్రశాంత్ నీల్ తెలిపారు. ఆ సమయంలో ఎన్టీఆర్ పడిన కష్టాన్ని చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా టెన్షన్ పడ్డారని చెప్పారు.
ఎన్టీఆర్‌ను “న్యూక్లియర్ ప్లాంట్” అంటూ ప్రశంసించిన ప్రశాంత్ నీల్… సినిమాపై ఆయనకు ఉన్న ప్యాషన్, కథలోని ఎమోషన్స్‌పై ఉన్న అర్థం అసాధారణమని అన్నారు. ఈ స్క్రిప్ట్ కోసం ఇద్దరూ దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు కష్టపడి పనిచేశారని వెల్లడించారు.
ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే… K.G.F, సలార్ తర్వాత తన డార్క్ షేడ్ క్యారెక్టర్ల ట్రిలజీలో ‘డ్రాగన్’ చివరి సినిమా అవుతుందని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటి జోనర్ సినిమాలు చేయబోనని కూడా వెల్లడించారు.
గ్లింప్స్‌లో కనిపించే విజువల్స్ ఎంత డార్క్‌గా ఉన్నా… సినిమాలోని అసలు ఎమోషన్ మాత్రం దేశభక్తేనని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఈ క్రేజీ అప్డేట్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. 2027 జూన్ 11న విడుదల కానున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!









