కాకినాడ జిల్లా ఉప్పాడ-కొత్తపల్లి మండలంలోని పొన్నాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బషీర్ బిబీ ఓలియా (బంగారు పాప) 71 వ వార్షికోత్సవాలు ఈనెల 6 ( శుక్రవారం) నుండి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బంగారు పాపను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముస్లిం భక్తులతోపాటు, ఒడిస్సా, మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు.









