సన్రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ గురించి మరోసారి సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు పెళ్లిపై కొత్త వార్త వైరల్గా మారింది.
ఇప్పటికే అనిరుధ్ వ్యక్తిగత జీవితంపై గతంలో పలుమార్లు రూమర్లు వినిపించాయి. ముఖ్యంగా నటి కీర్తి సురేష్తో ఆయన పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చినా, అవి నిజం కాలేదు. అనంతరం కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకున్నారు.
ఇక కావ్య మారన్, అనిరుధ్ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం కూడా చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే తాజాగా ప్రముఖ నటుడు వై.జీ. మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో కావ్య మారన్–అనిరుధ్ వివాహం గురించి ప్రశ్నించగా, ఆయన “అవును” అనే విధంగా స్పందించినట్లు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, కావ్య మారన్ విజయవంతమైన బిజినెస్ ఉమెన్, అనిరుధ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో, ఇద్దరూ పెళ్లి చేసుకుంటే అది “మ్యూజికల్ బిజినెస్” అవుతుందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.
అయితే ఇప్పటివరకు కావ్య మారన్ గానీ, అనిరుధ్ గానీ తమ పెళ్లిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ వార్తపై స్పష్టత రావాలంటే వారి నుంచి అధికారిక స్పందన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








