టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ముందుకొచ్చింది. ఇప్పటివరకు ఎన్నో కమర్షియల్ హిట్స్ అందించిన ఈ బ్యానర్, ఈసారి పూర్తిగా కొత్త జోనర్‌ను టచ్ చేస్తూ ప్యూర్ హారర్ మూవీని ప్రకటించింది. ఈ చిత్రానికి “418” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఇప్పటి వరకు హారర్ సినిమాలు అంటే కామెడీ మిక్స్ చేసి “హారర్-కామెడీ”గా తీసుకురావడం ట్రెండ్ అయ్యింది. కానీ “418”తో మాత్రం ఆ ట్రెండ్‌కు బ్రేక్ వేస్తూ, అసలైన భయాన్ని చూపించబోతున్నట్లు మేకర్స్ క్లియర్ చేశారు. “ఇప్పటివరకు నవ్వారు… ఇక భయపడే టైమ్ వచ్చింది” అనే ట్యాగ్‌లైన్‌తో సినిమాపై హైప్ పెంచేశారు.
ఈ ప్రాజెక్ట్‌కు మరో పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఆయన బ్రాండ్ జోడవడంతో ఈ హారర్ థ్రిల్లర్‌పై ఇండస్ట్రీలో ఆసక్తి మరింత పెరిగింది.
ఈ చిత్రాన్ని కీర్తన్ నడగౌడ తెరకెక్కిస్తుండగా, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్యూర్ హారర్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న “418” ప్రేక్షకులను ఎంతవరకు భయపెడుతుందో చూడాలి.








