“జక్కన్న చేతిలో పడితే ఐదేళ్లు లాక్ అయిపోయినట్టే” అనే మాట ఇండస్ట్రీలో చాలా కాలంగా వినిపిస్తోంది. అంతేకాదు, ‘కల్కి’ సినిమాలో కూడా ప్రభాస్ ఈ విషయంపై సరదాగా రాజమౌళిపై ఇన్‌డైరెక్ట్ పంచ్ వేశాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాను జక్కన్న ఊహించని వేగంతో పూర్తి చేస్తున్నాడు.
మహేష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్!
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, అనుకున్న సమయం కంటే ముందుగానే షూటింగ్ పూర్తి చేసే ప్లాన్‌లో ఉన్నారట రాజమౌళి. తాజాగా జరిగిన ఫ్యాన్స్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన, సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని వెల్లడించారు. పక్కనే నిర్మాతలు ఉండటంతో సరదాగా కామెంట్ చేస్తూనే, మిగిలిన షూట్‌ను కేవలం 80 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేశారు.
ఈ లెక్కన చూస్తే సెప్టెంబర్ నాటికి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ అభిమానులకు ఇది నిజంగా ఊహించని గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఇదే!
ఇంత వేగంగా షూటింగ్ పూర్తి చేయడం వెనుక జక్కన్న మాస్టర్ ప్లాన్ స్పష్టంగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ ఆధారిత సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ ఎంత కీలకమో తెలిసిందే. గతంలో ‘ఈగ’, ‘బాహుబలి’ వంటి సినిమాలు కూడా విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా ఆలస్యంగా విడుదలయ్యాయి.
అలాంటి పరిస్థితి ఈసారి రాకూడదనే ఉద్దేశంతో షూటింగ్‌ను ముందుగానే పూర్తి చేసి, మిగిలిన సమయాన్ని పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్, సీజీ వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం కేటాయించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
రిలీజ్ డేట్ మారదా?
ఈ లెక్కన ముందుగా ప్రకటించినట్టుగానే 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే… మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో నటిస్తుండగా, పవర్ఫుల్ విలన్ ‘కుంభ’ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నాడు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
మరి దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ భారీ అడ్వెంచర్ చిత్రం 2027 సమ్మర్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!








