Search
Close this search box.

  పుష్ప-2 రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌..

July 20, 2024 1:53 PM | Aditya369 News

పుష్ప-2 రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌..

పుష్ప-2' విషయంలో కథానాయకుడు అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌పై సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై అల్లు అర్జున్‌ సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌ స్పందించారు. ఇవాళ జరిగిన 'ఆయ్‌' సినిమా ప్రెస్‌మీట్‌లో ఆయన వివరణ ఇచ్చారు.

ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ... "పుష్ప-2 గురించి మీడియా లో వస్తున్న న్యూస్ చూసి మేం నవ్వుకుంటున్నాం. ఆ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ షూటింగ్‌ పార్ట్ ఇంకా 15 నుంచి 20 రోజుల లోపు ఉంటుంది. ఇది కాకుండా వేరే ఆర్టిస్టులతో కూడా చిత్రీకరణ మిగిలి వుంది.

దర్శకుడు సుకుమార్‌ ఎడిటింగ్‌ చూసుకుని, ఇంకా ఏమైనా అల్లు అర్జున్‌ పార్ట్‌ బ్యాలెన్స్ వుందేమో క్లారిటీ తెచ్చుకుని షూటింగ్‌ పెట్టుకుందాం అన్నారు. అల్లు అర్జున్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని గడ్డం ట్రిమ్ చేశారంతే. ఆగష్టు మొదటి వారంలో షూటింగ్‌ తిరిగి మొదలవుతుంది. పుష్ప లాంటి పాన్ ఇండియా క్రేజీ ఫిలింని సింపుల్ గా ఎందుకు తీసుకుంటారు?" అని బన్నీ వాస్ పేర్కొన్నారు.

ఇటీవల దర్శకుడు సుకుమార్ తో విభేదాలు వచ్చాయని, అందుకే అల్లు అర్జున్ గడ్డం తీసేసి ఫారెన్ ట్రిప్ వెళ్లాడని కథనాలు వచ్చాయి.

పుష్ప-2′ విషయంలో కథానాయకుడు అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌పై సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై అల్లు అర్జున్‌ సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌ స్పందించారు. ఇవాళ జరిగిన ‘ఆయ్‌’ సినిమా ప్రెస్‌మీట్‌లో ఆయన వివరణ ఇచ్చారు.

ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ… “పుష్ప-2 గురించి మీడియా లో వస్తున్న న్యూస్ చూసి మేం నవ్వుకుంటున్నాం. ఆ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ షూటింగ్‌ పార్ట్ ఇంకా 15 నుంచి 20 రోజుల లోపు ఉంటుంది. ఇది కాకుండా వేరే ఆర్టిస్టులతో కూడా చిత్రీకరణ మిగిలి వుంది.

దర్శకుడు సుకుమార్‌ ఎడిటింగ్‌ చూసుకుని, ఇంకా ఏమైనా అల్లు అర్జున్‌ పార్ట్‌ బ్యాలెన్స్ వుందేమో క్లారిటీ తెచ్చుకుని షూటింగ్‌ పెట్టుకుందాం అన్నారు. అల్లు అర్జున్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని గడ్డం ట్రిమ్ చేశారంతే. ఆగష్టు మొదటి వారంలో షూటింగ్‌ తిరిగి మొదలవుతుంది. పుష్ప లాంటి పాన్ ఇండియా క్రేజీ ఫిలింని సింపుల్ గా ఎందుకు తీసుకుంటారు?” అని బన్నీ వాస్ పేర్కొన్నారు.

ఇటీవల దర్శకుడు సుకుమార్ తో విభేదాలు వచ్చాయని, అందుకే అల్లు అర్జున్ గడ్డం తీసేసి ఫారెన్ ట్రిప్ వెళ్లాడని కథనాలు వచ్చాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore