మెగాస్టార్ చిరంజీవి చేసిన “చిరు లీక్స్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ‘ఆచార్య’ టైటిల్‌ను అనుకోకుండా బయటపెట్టి సోషల్ మీడియాలో వైరల్ అయిన చిరంజీవి, ఇప్పుడు మరోసారి అదే స్టైల్లో మెగా అభిమానులను ఊపేస్తున్నారు. ఈసారి టార్గెట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’.
ఈ సినిమా ట్రైలర్‌ను మే 18న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించగా… ట్రైలర్‌ను ముందుగానే చూసిన చిరంజీవి తన ఎగ్జైట్మెంట్ను ఆపుకోలేక సోషల్ మీడియాలో పోస్టు పెట్టేశారు. “జస్ట్ వావ్!” అంటూ మొదలుపెట్టిన చిరు… దాదాపు మూడు నిమిషాల పాటు సాగే ట్రైలర్ “ప్యూర్ పవర్ ప్యాక్డ్… ఫైర్‌లా ఉంది” అంటూ మూవీ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
దర్శకుడు బుచ్చి బాబు , సంగీత దర్శకుడు A. R. రెహమాన్, అలాగే రామ్ చరణ్ అందరూ తమ కెరీర్ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారని చిరంజీవి చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. “ఆడియన్స్ ఎంత ఊహించుకున్నా… ట్రైలర్ దాన్ని మించి ఉంటుంది. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి” అంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు.
ట్రైలర్ డైలాగ్ కూడా లీక్ చేసిన చిరు!
ఇక్కడితో ఆగకుండా చిరంజీవి తన ట్రేడ్‌మార్క్ “చిరు లీక్స్”ను మరోసారి రిపీట్ చేశారు. ట్రైలర్‌లోని ఒక పవర్ఫుల్ డైలాగ్‌ను కూడా బయటపెట్టేశారు.
> “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు..”
ఈ ఒక్క డైలాగ్ ట్రైలర్లో మైండ్ బ్లోయింగ్‌గా ఉందంటూ చిరంజీవి చెప్పడంతో మెగా ఫ్యాన్స్‌లో హైప్ డబుల్ అయిపోయింది. ఇక దర్శకుడు బుచ్చిబాబుకు సరదాగా “సారీ… ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పి లీక్ చేయాల్సి వచ్చింది” అంటూ చేసిన కామెంట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
‘రంగస్థలం’ వైబ్స్‌తో వస్తున్న చరణ్
‘పెద్ది’ సినిమా రామ్ చరణ్ కెరీర్లో 16వ చిత్రంగా తెరకెక్కుతోంది. పూర్తిగా ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ మూవీ… ‘రంగస్థలం’ తరహా రా అండ్ రస్టిక్ వైబ్స్‌తో ఉండబోతుందనే టాక్ ఇప్పటికే బలంగా వినిపిస్తోంది..








