Search
Close this search box.

  🔥 రజనీకాంత్ 173వ చిత్రానికి దర్శకుడు ఖరారు: కమల్ హాసన్ నిర్మాణంలో రామ్‌కుమార్ బాలకృష్ణన్

November 25, 2025 8:04 PM | Aditya369 News

🔥 రజనీకాంత్ 173వ చిత్రానికి దర్శకుడు ఖరారు: కమల్ హాసన్ నిర్మాణంలో రామ్‌కుమార్ బాలకృష్ణన్

ప్రముఖ నటులు రజనీకాంత్ మరియు కమల్ హాసన్ కలయికలో రానున్న ప్రతిష్ఠాత్మక చిత్రం (తలైవా 173)పై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఈ భారీ ప్రాజెక్టుకు నిర్మాతగా కమల్ హాసన్ వ్యవహరిస్తుండగా, దర్శకుడిగా యువ ప్రతిభావంతుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఎంపికైనట్లు కోలీవుడ్ వర్గాలు విశ్వసనీయంగా తెలిపాయి. 'పార్కింగ్' చిత్రంతో గుర్తింపు పొందిన రామ్‌కుమార్‌, రజనీకాంత్ కెరీర్‌లోనే 173వ చిత్రానికి దర్శకత్వం వహించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ శుభ పరిణామంతో రజనీ-కమల్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో గత కొంతకాలంగా అనేక చర్చలు జరిగాయి. తొలుత యువ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ, ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు సి. సుందర్ హారర్ కథతో రజనీకాంత్‌ను సంప్రదించారు. అయితే, రజనీకాంత్‌కు ఆ కథ నచ్చకపోవడంతో సుందర్ ప్రయత్నం విరమించుకున్నారు. ఈ విధంగా పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చి చివరికి రామ్‌కుమార్ బాలకృష్ణన్‌కు అవకాశం దక్కడం గమనార్హం.
తాజాగా దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్ వినిపించిన కాలేజ్ బ్యాక్‌డ్రాప్ కథ రజనీకాంత్‌తో పాటు నిర్మాత కమల్ హాసన్‌ను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో, ఇద్దరూ ఈ కథకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతా సవ్యంగా జరిగితే, ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మార్చి నుంచి సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. అయితే, రామ్‌కుమార్ ఇప్పటికే హీరో శింబుతో తన 49వ చిత్రాన్ని ప్రకటించారు. ఆ చిత్రం వాయిదా పడిన నేపథ్యంలో, రజనీకాంత్ సినిమాను ముందుగా ప్రారంభిస్తారా లేక శింబు చిత్రాన్ని మొదలుపెడతారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రముఖ నటులు రజనీకాంత్ మరియు కమల్ హాసన్ కలయికలో రానున్న ప్రతిష్ఠాత్మక చిత్రం (తలైవా 173)పై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఈ భారీ ప్రాజెక్టుకు నిర్మాతగా కమల్ హాసన్ వ్యవహరిస్తుండగా, దర్శకుడిగా యువ ప్రతిభావంతుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఎంపికైనట్లు కోలీవుడ్ వర్గాలు విశ్వసనీయంగా తెలిపాయి. ‘పార్కింగ్’ చిత్రంతో గుర్తింపు పొందిన రామ్‌కుమార్‌, రజనీకాంత్ కెరీర్‌లోనే 173వ చిత్రానికి దర్శకత్వం వహించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ శుభ పరిణామంతో రజనీ-కమల్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

ఈ సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో గత కొంతకాలంగా అనేక చర్చలు జరిగాయి. తొలుత యువ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ, ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు సి. సుందర్ హారర్ కథతో రజనీకాంత్‌ను సంప్రదించారు. అయితే, రజనీకాంత్‌కు ఆ కథ నచ్చకపోవడంతో సుందర్ ప్రయత్నం విరమించుకున్నారు. ఈ విధంగా పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చి చివరికి రామ్‌కుమార్ బాలకృష్ణన్‌కు అవకాశం దక్కడం గమనార్హం.

తాజాగా దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్ వినిపించిన కాలేజ్ బ్యాక్‌డ్రాప్ కథ రజనీకాంత్‌తో పాటు నిర్మాత కమల్ హాసన్‌ను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో, ఇద్దరూ ఈ కథకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతా సవ్యంగా జరిగితే, ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మార్చి నుంచి సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. అయితే, రామ్‌కుమార్ ఇప్పటికే హీరో శింబుతో తన 49వ చిత్రాన్ని ప్రకటించారు. ఆ చిత్రం వాయిదా పడిన నేపథ్యంలో, రజనీకాంత్ సినిమాను ముందుగా ప్రారంభిస్తారా లేక శింబు చిత్రాన్ని మొదలుపెడతారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు