మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 (AK 47)” ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కలగలిపిన ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 50%కు పైగా షూటింగ్ పూర్తి చేసుకుందని టాక్. ఈ ఏడాది దసరా సందర్భంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మరో యంగ్ హీరో నారా రోహిత్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ధురంధర్ 2’ సినిమాలో నటించిన ఉదయ్ బీర్ సందు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
‘ధురంధర్ 2’ భారీ విజయంతో అక్కడ నటించిన నటీనటులకు మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఉదయ్ బీర్ సందును చూసి ఇంప్రెస్ అయిన త్రివిక్రమ్, ఈ సినిమాకి ఆయనను తీసుకురావాలని భావిస్తున్నట్లు టాక్. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆయన విలన్ పాత్రలో వెంకటేష్‌ను ఢీ కొట్టనున్నాడని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్తలతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.
ఇక త్రివిక్రమ్-వెంకటేష్ కాంబినేషన్ విషయానికి వస్తే, దర్శకుడిగా వీరిద్దరి కాంబోలో వస్తున్న తొలి చిత్రం ఇదే. అయితే రచయితగా త్రివిక్రమ్ అందించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాల్లో వెంకటేష్ నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు అదే కాంబో డైరెక్టర్-హీరోగా రాబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
ఇక వెంకటేష్ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మొత్తానికి, “ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47” సినిమా రోజురోజుకీ హైప్ పెంచుకుంటూ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.








