ఏడు పదులు దాటినా జోష్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతున్న చిరంజీవి… ‘విశ్వంభర’ విషయంలో మాత్రం కొంచెం స్లో అయిపోయినట్టే కనిపిస్తున్నారు. కేవలం ఆరు నెలల్లోనే “శంకర వరప్రసాద్” లాంటి సాలిడ్ హిట్ ఇచ్చిన చిరు… రెండేళ్ల క్రితమే ప్రారంభమైన ‘విశ్వంభర’ను ఇప్పటికీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఇబ్బందులు పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
అప్డేట్స్ ఇవ్వని వశిష్ట
‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ట మాత్రం సినిమా అప్డేట్స్ విషయంలో పూర్తిగా సైలెంట్‌గా ఉన్నారు. గత సంక్రాంతికి రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో విఎఫ్ఎక్స్ క్వాలిటీపై నెగెటివ్ కామెంట్స్ రావడంతో… ఆ తర్వాత అప్పుడప్పుడూ ఒక పాట రిలీజ్ చేయడం తప్ప ఎలాంటి పెద్ద అప్డేట్ ఇవ్వలేదు. ఇదే సమయంలో UV Creations నిర్మించిన ఇతర సినిమాలు సైలెంట్‌గా రిలీజ్ అవుతుండగా… భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ మాత్రం ఇంకా నిలిచిపోవడం ఆశ్చర్యంగా మారింది. దీంతో “ఇంత టైమ్ ఎందుకు పడుతోంది?” అంటూ మూవీ లవర్స్ డైరెక్టర్‌పై విమర్శలు చేస్తున్నారు.
ఇక చిరంజీవి స్వయంగా జూన్ లేదా జులైలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని హింట్ ఇచ్చినా… మేకర్స్ నుంచి ప్రమోషన్స్‌లో ఎలాంటి కదలిక లేకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది.
మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్
ఇక మరోవైపు KVN Productions బ్యానర్లో బాబీ కొల్లి దర్శకత్వంలో రావాల్సిన చిరు కొత్త సినిమా కూడా డిలే అవుతోందన్న వార్తలు మెగా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సూపర్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.
అయితే ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా షూటింగ్‌లపై ప్రభావం పడిందని, దాంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో “అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ సినిమా ఎందుకు ఆగాలి?” అంటూ నెటిజన్స్ కూడా స్పందిస్తున్నారు.
నెగెటివ్ వైబ్స్ పెరుగుతున్నాయా?
ఇదే సమయంలో విజయ్ చివరి సినిమా ‘జన నాయకన్’ విషయంలో కూడా ఇలాంటి నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. తెలుగులో రిలీజ్‌కు ముందే ఇలాంటి పరిస్థితి రావడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
క్లారిటీ ఇస్తారా?
ఒకవైపు గ్రాఫిక్స్ పనుల కారణంగా ఆలస్యం అవుతోందని UV Creations చెబుతుండగా… మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చూపిస్తూ KVN Productions ప్రాజెక్ట్ డిలే అవుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇలాంటి గాసిప్స్ పెరుగుతున్న నేపథ్యంలో… మేకర్స్ త్వరలో అయినా అధికారిక క్లారిటీ ఇస్తారా? లేక ఇదే ప్రచారం కొనసాగుతుందా? అనేది చూడాలి.







