గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న “పెద్ది” సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదట ఈ నెల 30న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఆ డేట్‌కు సినిమా రావడం కష్టమే అన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇంకా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు వారం రోజుల పాటు మిగిలి ఉందని సమాచారం. అంతేకాకుండా ఒక ఐటమ్ సాంగ్ కూడా బ్యాలన్స్‌లో ఉందట. ఈ పాటను ఈ నెల 9వ తేదీ నుంచి షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఈ ఐటమ్ సాంగ్‌లో ఎవరు కనిపించబోతున్నారు అన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొదటగా మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే పేర్లు బాగా వినిపించాయి. కానీ అందరి అంచనాలకు షాక్ ఇస్తూ… ఎవరూ ఊహించని ఒక పేరు ఫైనల్ అయినట్లు సమాచారం.
‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న మానస వారణాసి ఈ ఐటమ్ సాంగ్‌లో కనిపించబోతుందని టాక్. మిస్ ఇండియా నుంచి టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఆమె, మొదటి సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా… ‘కపుల్ ఫ్రెండ్లీ’తో తన నటనకు మంచి గుర్తింపు సంపాదించింది.
ఈ నేపధ్యంలో ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నప్పటికీ… అనూహ్యంగా ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. దీంతో ఈ పాటలో ఏదో స్పెషల్ ఉంటుందా? లేక షూట్ త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి “పెద్ది” సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం మానస వారణాసి పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, జగపతి బాబు ప్రత్యేక గెటప్‌లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.








