నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సీక్వెల్ ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ పాల్గొన్న ఇంటర్వ్యూలో, ప్రగ్యా జైస్వాల్ పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటి భాగంలో బాలకృష్ణ భార్యగా కనిపించిన ప్రగ్యా, ఈ సీక్వెల్‌లోని టీజర్, ట్రైలర్లలో ఎక్కడా కనిపించకపోవడంపై ప్రేక్షకుల్లో చర్చ నడుస్తోంది.
యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ తనదైన శైలిలో ఫన్నీగా సమాధానం ఇచ్చారు. “అఖండ 2లో ప్రగ్యా పాత్రలో పెద్దగా స్కోప్ లేదు. ఒకవేళ పెడదాం అనుకున్నా కథకు అడ్డం పడుతోంది ఆ పాత్ర. అందుకే ఆమె ఫోటోకి దండ వేశాము” అంటూ బాలయ్య నవ్వుతూ చెప్పుకొచ్చారు. మొదటి సినిమాలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్‌పై బాలకృష్ణ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు, ఆమె పాత్ర చనిపోయినట్లుగా పరోక్షంగా సూచిస్తూ, అభిమానులను ఆశ్చర్యపరిచాయి, అదే సమయంలో నవ్వులు పూయించాయి.
‘అఖండ’ లాంటి భారీ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ‘అఖండ 2’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, బోయపాటి శ్రీను మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సిద్ధమైంది. సినిమా విడుదల దగ్గర పడుతున్న ఈ సమయంలో, బాలకృష్ణ చేసిన ఈ ఫన్నీ కామెంట్స్ ‘అఖండ 2’ గురించి మరింత చర్చకు దారితీసి, సినిమాపై ఆసక్తిని పెంచేందుకు ఉపయోగపడుతున్నాయి.









