Search
Close this search box.

  పెద్ది సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్..?

March 26, 2026 10:10 PM | Aditya369 News

పెద్ది సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమా గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఆ సాంగ్‌లో ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది! ఈ పాటలో మృణాల్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉండొచ్చని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం ఆమె ఒక్కడే స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తుందని చెబుతున్నారు.

ఇప్పటివరకు ఈ వార్తలపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. కానీ ఈ రూమర్స్ మాత్రం అభిమానుల్లో భారీ ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా ‘పెద్ది’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు