తమిళ స్టార్ హీరో ధనుష్ పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. రాంజానాతో బాలీవుడ్లో ఘన విజయం సాధించిన ఆయన, తెలుగులో సర్, కుభేర చిత్రాలతో సూపర్హిట్లు అందుకున్నాడు. అన్ని భాషల్లోనూ నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఆయనకున్న ప్రత్యేకత. తెలుగు దర్శకులు, నిర్మాతల కథలు క్రమం తప్పకుండా వింటూ, వారితో సన్నిహితంగా కలుస్తూ ఉంటాడు.
తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు వేణు ఉడుగుల వినిపించిన స్క్రిప్ట్‌ను ధనుష్ ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఆయనకు తెలుగులో మూడో సినిమా కానుంది. నీది నాది ఒకే కథ, విరాట పర్వం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వేణు ఉడుగులకు ఇది మరో ముఖ్యమైన అవకాశంగా మారింది.
ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాదిలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇదిలా ఉండగా, తమిళం, తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ దర్శకులను ఫైనలైజ్ చేస్తూ ధనుష్ తన కెరీర్‌ను పాన్ ఇండియా స్థాయిలో మరింత విస్తరించే దిశగా తెలివైన అడుగులు వేస్తున్నాడు..









