తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… తన హామీని నిలుపుకుంటూ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. తాజాగా, ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హన్మకొండ నుంచి సిద్ధిపేటకు వెళుతున్న బస్సులో కొందరు మహిళలు వెల్లుల్లిపాయల పొట్టు తీసుకుంటూ, హాయిగా ఉచిత ప్రయాణం చేస్తుండడం ఆ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.









