Search
Close this search box.

  అల్లు అర్జున్-లోకేష్ ప్రాజెక్ట్‌పై షాకింగ్ క్లారిటీ..!

June 4, 2026 10:56 PM | Aditya369 News

అల్లు అర్జున్-లోకేష్ ప్రాజెక్ట్‌పై షాకింగ్ క్లారిటీ..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ ‘AA23’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా విడుదల చేసిన థీమ్ వీడియో ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది.

అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘AA23’ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని, సినిమా ప్రస్తుతం హోల్డ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి.

కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే కీలక పాత్రల కోసం కాస్టింగ్ ప్రక్రియ కూడా జరుగుతోంది. లోకేష్ కనగరాజ్ చెప్పిన కథకు అల్లు అర్జున్ ఇప్పటికే ఓకే చెప్పగా, ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో చిత్ర బృందం బిజీగా ఉంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని పక్కా ప్లానింగ్‌తో ముందుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో పూర్తి చేసి, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

‘రాకా’ పూర్తయిన వెంటనే బన్నీ తన పూర్తి దృష్టిని లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌పై పెట్టనున్నాడు. అనంతరం ‘AA23’ షూటింగ్‌ను ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేసి 2027లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దీంతో బన్నీ-లోకేష్ కాంబో మూవీ ఆగిపోయిందనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు