Search
Close this search box.

  అక్టోబరులో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు… రూ.1.87 లక్షల కోట్లుగా నమోదు..

November 1, 2024 5:43 PM | Aditya369 News

అక్టోబరులో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు… రూ.1.87 లక్షల కోట్లుగా నమోదు..

అక్టోబరు-2024 జీఎస్టీ వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే 8.9 శాతం, సెప్టెంబర్ నెలతో పోలిస్తే 8.1 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది అక్టోబరు నెలలో రూ.1.72 లక్షల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.

రూ.1,87,346 కోట్ల జీఎస్టీ వసూళ్లలో రూ.33,821 కోట్లు సీజీఎస్టీ కాగా, రూ.41,864 కోట్లు ఎస్‌జీఎస్టీ, రూ.99,111 కోట్లు ఐజీఎస్టీ రూపంలో వసూలయ్యాయి. సెస్‌ల రూపంలో మరో రూ.12,550 కోట్లు వచ్చాయి. జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల మెరుగైన ఆర్థిక కార్యకలాపాలు, పన్ను వసూలు సామర్థ్యాన్ని సూచిస్తుంది.

దేశీయ లావాదేవీలు 10.6 శాతం వృద్ధి చెంది రూ.1.42 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దిగుమతులపై విధించిన పన్నులు 4 శాతం పెరిగి రూ.45,096 కోట్లుగా నమోదయ్యాయి.

2024 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.12.74 లక్షల కోట్లు. 2023లో ఇదే కాలంలో నమోదైన రూ.11.64 లక్షల కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 9.4 శాతం వృద్ధి నమోదైంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు