Search
Close this search box.

  వైరల్ అవుతున్న ‘ఉస్తాద్’ స్టైల్: పవన్ పవర్‌ఫుల్ డైలాగ్‌తో రాశీ ఖన్నా వినూత్న ప్రచారం

March 18, 2026 7:24 PM | Aditya369 News

వైరల్ అవుతున్న ‘ఉస్తాద్’ స్టైల్: పవన్ పవర్‌ఫుల్ డైలాగ్‌తో రాశీ ఖన్నా వినూత్న ప్రచారం

దర్శకుడు హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది కానుకగా రేపు (గురువారం) థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ చెప్పిన ‘ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం’ అనే డైలాగ్ ఇప్పటికే మాస్ ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లింది. ఈ డైలాగ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నటి రాశీ ఖన్నా ఒక వినూత్నమైన పద్ధతిని ఎంచుకున్నారు.
ప్రమోషన్లలో భాగంగా రాశీ ఖన్నా ధరించిన నలుపు రంగు షర్టు వెనుక ఈ ఫేమస్ డైలాగ్‌ను ప్రింట్ చేయించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ‘ఉస్తాద్’ స్టైల్‌లో ఆమె స్లైలిష్‌గా కనిపిస్తూ చేసిన ఈ ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తర్వాత పవన్, హరీశ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, ఈ చిన్న ప్రమోషనల్ ట్రిక్ కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. మెగా అభిమానులు ఈ ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, రాశీ ఖన్నా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఎస్. థమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తుండటం మరో విశేషం. పార్థిబన్, గౌతమి వంటి సీనియర్ నటులు ఈ సినిమాలో భాగం కావడంతో, రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు