Search
Close this search box.

  JEE మెయిన్‌ ఎగ్జామ్ లో ఇకపై ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవు..!

October 18, 2024 5:38 PM | Aditya369 News

JEE మెయిన్‌ ఎగ్జామ్ లో ఇకపై ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవు..!

జేఈఈ మెయిన్ పరీక్ష విధానంలో కీలక మార్పులు జరగనున్నాయి. గత మూడేళ్ల నుంచి సెక్షన్‌ బీలో కొనసాగుతున్న ఛాయిస్‌ ఆప్షన్​ ఇక ఉండదు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం ప్రకటించింది. సెక్షన్ బీలో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవని వెల్లడించింది. కరోనా మహమ్మారి సమయంలో విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు ఏర్పడిన ఆటంకాల నేపథ్యంలో 2021 జేఈఈ మెయిన్స్​లో ఎన్టీఏ మార్పులు చేసింది. సెక్షన్ బీలో 10 ప్రశ్నలు ఇచ్చి కేవలం 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలని విద్యార్థులకు ఆప్షన్ ఇచ్చింది.
2024 వరకు అదే విధానాన్నికొనసాగించింది ఎన్టీఏ. కానీ 2025 జేఈఈ పరీక్ష నుంచి మాత్రం ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని తాజాగా ప్రకటించింది. 2021కు ముందు ఉన్న పద్ధతిలోనే పరీక్ష ఉంటుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. సెక్షన్ బీలో 5 ప్రశ్నలే ఇవ్వనున్నట్లు, ఐదింటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుందని తెలిపింది. ఏదైనా సమాచారం లేదా అప్డేట్ల కోసం, విద్యార్థులు NTA వెబ్‌సైట్ nta.ac.in లేదా JEE మెయిన్ వెబ్‌సైట్ jeemain.nta.nic.inని సందర్శించాలని సూచించింది.
పరీక్ష విధానం ఇలా!జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్లు భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్‌లో 75 ప్రశ్నలు, ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చేవారు. గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉండేవి. కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు ప్రతి సబ్జెక్టులో ఛాయిస్‌ ప్రశ్నలు ఇచ్చారు. జేఈఈ మెయిన్‌ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బీ సెక్షన్లు ఉండేవి. సెక్షన్‌ ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాలి. సెక్షన్‌ బీలో 10 ఇచ్చి అయిదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ఛాయిస్‌ ఇచ్చారు. ఈసారి నుంచి ఆ ఛాయిస్‌ను విరమించుకుంటున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.

జేఈఈ మెయిన్ పరీక్ష విధానంలో కీలక మార్పులు జరగనున్నాయి. గత మూడేళ్ల నుంచి సెక్షన్‌ బీలో కొనసాగుతున్న ఛాయిస్‌ ఆప్షన్​ ఇక ఉండదు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం ప్రకటించింది. సెక్షన్ బీలో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవని వెల్లడించింది. కరోనా మహమ్మారి సమయంలో విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు ఏర్పడిన ఆటంకాల నేపథ్యంలో 2021 జేఈఈ మెయిన్స్​లో ఎన్టీఏ మార్పులు చేసింది. సెక్షన్ బీలో 10 ప్రశ్నలు ఇచ్చి కేవలం 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలని విద్యార్థులకు ఆప్షన్ ఇచ్చింది.

2024 వరకు అదే విధానాన్నికొనసాగించింది ఎన్టీఏ. కానీ 2025 జేఈఈ పరీక్ష నుంచి మాత్రం ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని తాజాగా ప్రకటించింది. 2021కు ముందు ఉన్న పద్ధతిలోనే పరీక్ష ఉంటుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. సెక్షన్ బీలో 5 ప్రశ్నలే ఇవ్వనున్నట్లు, ఐదింటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుందని తెలిపింది. ఏదైనా సమాచారం లేదా అప్డేట్ల కోసం, విద్యార్థులు NTA వెబ్‌సైట్ nta.ac.in లేదా JEE మెయిన్ వెబ్‌సైట్ jeemain.nta.nic.inని సందర్శించాలని సూచించింది.

పరీక్ష విధానం ఇలా!
జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్లు భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్‌లో 75 ప్రశ్నలు, ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చేవారు. గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉండేవి. కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు ప్రతి సబ్జెక్టులో ఛాయిస్‌ ప్రశ్నలు ఇచ్చారు. జేఈఈ మెయిన్‌ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బీ సెక్షన్లు ఉండేవి. సెక్షన్‌ ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాలి. సెక్షన్‌ బీలో 10 ఇచ్చి అయిదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ఛాయిస్‌ ఇచ్చారు. ఈసారి నుంచి ఆ ఛాయిస్‌ను విరమించుకుంటున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు