టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తన కెరీర్లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎల్లమ్మ’ చిత్రంతో ఆయన హీరోగా పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్‌పై ఈ భారీ ప్రాజెక్టును నిర్మించబోతున్నారు. సంగీత దర్శకుడిగా దశాబ్దాలుగా అలరిస్తున్న డిఎస్పీ, ఇప్పుడు నటుడిగా ప్రేక్షకులను పలకరించనుండటంతో టాలీవుడ్లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ప్రాజెక్ట్ గురించి డిఎస్పీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు వేణు యెల్దండి తనకు ఈ కథ చెప్పినప్పుడు, కేవలం ఐదు నిమిషాల్లోనే తాను కథకు పూర్తిగా కనెక్ట్ అయిపోయానని వెల్లడించారు. గతంలోనూ చాలామంది దర్శకులు తనను హీరోగా నటించమని కోరినప్పటికీ, సరైన ఉత్సాహాన్నిచ్చే కథ దొరకలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ‘ఎల్లమ్మ’ కథలో ఉన్న లోతు, భావోద్వేగాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, అందుకే హీరోగా నటించేందుకు పచ్చజెండా ఊపానని డిఎస్పీ స్పష్టం చేశారు.
తనను హీరోగా పరిచయం చేస్తున్న నిర్మాత దిల్ రాజుకు, అద్భుతమైన కథను సిద్ధం చేసిన వేణు యెల్దండికి డిఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే తన మ్యూజిక్ మరియు డాన్సులతో స్టేజ్‌పై ప్రకంపనలు సృష్టించే రాక్‌స్టార్, ఇప్పుడు వెండితెరపై నటుడిగా ఏ స్థాయిలో మెప్పిస్తారోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








