పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడిప్పుడే ‘హరిహర వీరమల్లు’ ప్రభావం నుంచి బయటపడుతున్న తరుణంలో, ఆయన నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ఓజీ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్‌తో పాటు సినీప్రేమికులు కూడా ఈ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన మాస్ అవతార్‌ను మరోసారి వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక తాజాగా, ఈ సినిమా ప్రమోషన్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. అందులో భాగంగా, ఆగస్టు 1న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ పాటను కోలీవుడ్ స్టార్ శింబు ఆలపించగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ మాస్ బీట్‌తో కంపోజ్ చేశాడట.
ఈ సినిమాకు యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తనదైన స్టైల్ టేకింగ్‌తో పవన్ క్యారెక్టర్‌ను మరింత పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించనున్నాడని టాక్. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు…