Search
Close this search box.

  రిస్క్ చేస్తున్న మహేష్..! డూప్ లేకుండా స్టాంట్స్..?

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శక ధీరుడు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో ఒక భారీ అడ్వెంచర్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో, అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు..ఇకపై షెడ్యూల్‌ను కెన్యాలో ప్లాన్ చేసిన చిత్రబృందం, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు దాన్ని సౌతాఫ్రికాకు మార్చినట్టు సమాచారం. అక్కడ ఓ ప్రధాన టాకీపార్ట్‌తో పాటు, ఒక పాట, అడవిలో సాగే మేజర్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల కోసం ఇప్పటికే యూనిట్‌ రిహార్సల్స్‌తో బిజీగా ఉంది..ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే… యాక్షన్ సన్నివేశాలను మహేశ్‌బాబు డూప్ లేకుండా స్వయంగా చేయబోతున్నారట. ఈ కారణంగా షూటింగ్ సమయంలో యూనిట్ పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటోందని తెలుస్తోంది.కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో మాధవన్, పృథ్వీ రాజ్ సుకుమారన్ కనిపించనున్నారన్న వార్తలు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.. హై ఎండ్ విజువల్స్ తో ఈ సినిమా భారీగా వండర్ గా రానుంది..ఈ మూవీపై ఇండియన్ సినిమా పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు