Search
Close this search box.

  బ్లాస్టింగ్ కాంబో..! ప్రశాంత్ నీల్ డైరెక్టన్లో రామ్ చరణ్..?

కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ఇప్పుడు టాలీవుడ్‌నే తన హబ్‌గా మార్చుకున్నట్టే కనిపిస్తోంది. ‘సలార్’తో ప్రభాస్‌కు మాస్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఆయన, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో డ్రాగన్ అనే ఓ భారీ సినిమా చేస్తున్నారు.. ఈ ప్రాజెక్ట్ 2026 జూన్‌లో విడుదల కానుంది..ఆ తర్వాత ప్రశాంత్ నీల్, మళ్లీ ప్రభాస్‌తో ‘సలార్ 2’ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. కానీ ‘సలార్ 2’ తర్వాత ఆయన కన్నడ చిత్రసీమకు తిరిగి వెళ్లుతారన్న ఊహాగానాలకు ఇప్పుడు పుల్ స్టాప్ పడినట్టుంది..తాజా సమాచారం ప్రకారం, సలార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్‌లో మరో స్టార్ హీరో రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నారట. మొదట ఈ కథను అల్లు అర్జున్ కోసం తయారు చేసినప్పటికీ, ప్రస్తుతం అదే స్క్రిప్ట్ రామ్ చరణ్‌కు మార్చారని టాక్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని తెలుస్తోంది..ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ఈ కథకు సంబంధించిన స్క్రీన్‌ప్లే వర్క్‌పై ఫోకస్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే, 2027 చివరిలో లేదా 2028 మొదట్లో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కావచ్చు. విడుదలకు మరో రెండేళ్ల సమయం పట్టొచ్చన్న అంచనాలున్నాయి. కనీసం నాలుగైదేళ్ల వరకు టాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండేలా కనిపిస్తున్నారు..

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు